మంగళవారం 22 సెప్టెంబర్ 2020
National - Aug 09, 2020 , 10:15:58

విజయవాడ అగ్నిప్రమాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి

విజయవాడ అగ్నిప్రమాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి

న్యూఢిల్లీ : విజయవాడ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అగ్నిప్రమాద ఘటన వివరాలను సీఎం జగన్‌కు ఫోన్‌ చేసి తెలుసుకున్నానని మోదీ ట్వీట్‌ చేశారు. కేంద్రం నుంచి కూడా అన్ని విధాలా మద్దతు ఉంటుందని సీఎంకు మోదీ భరోసానిచ్చారు. 

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో ఏడుగురు కొవిడ్‌ బాధితులు ప్రాణాలు క్పోయిన విషయం విదితమే. మృతుల కుటుంబాలకు సీఎం జగన్‌ రూ. 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.


logo