శనివారం 31 అక్టోబర్ 2020
National - Aug 21, 2020 , 21:41:13

ఏనుగు కోపానికి బ‌ల‌య్యేవాడు.. మ‌రో జ‌న్మెత్తాడు : వీడియో వైర‌ల్‌

ఏనుగు కోపానికి బ‌ల‌య్యేవాడు.. మ‌రో జ‌న్మెత్తాడు :  వీడియో వైర‌ల్‌

మ‌నిషి ఎంజాయ్‌మెంట్‌కు జంతువులు బ‌ల‌వ్వాల్సిందే కాని జంతువులు కార‌ణంగా మ‌నిషి ఎప్పుడూ బాధ‌ప‌డేలేదు. ముఖ్యంగా ఏనుగుల విష‌యంలో. ఈ మ‌ధ్య కేర‌ళ‌లో క‌డుపుతో ఉన్న ఏనుగుకు ఆహారంగా బాంబు పెట్టి చంపేశారు. ఆ ఘ‌ట‌న త‌ర్వాత జంతువుల విష‌యంలో ప్రేమ ఎక్కువైపోయింది. కానీ ఏనుగుకు ఏమైందో ఏమో ఒక వ్య‌క్తి మీద విరుచుకుపడింది. 14 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నందా ట్విట‌ర్‌లో షేర్ చేశారు.

'ఈ మ‌నిషికి రెండ‌వ జీవితం ఉంది' అనే శీర్షిక‌ను వీడియోకు జోడించారు. అత‌ను ఒక పొద వెనుక కూర్చొని ఉన్నాడు. ఏనుగు మ‌నిషి మీద‌కు అమాంతం వ‌స్తుండ‌డంతో అత‌ను చేతిలోని క‌ర్ర‌తో కొట్ట‌బోయాడు. దీంతో ఏనుగు కాళ్ల‌తో త‌న్న‌బోయింది. మొత్తానికి ఏనుగు ఆగ్ర‌హానికి ఆ వ్య‌క్తి బ‌ల‌య్యేవాడు త‌ప్పించుకున్నాడు. ఆన్‌లైన్‌లోకి వ‌చ్చిన కాసేప‌టికే  ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.