బుధవారం 21 అక్టోబర్ 2020
National - Sep 24, 2020 , 16:35:43

భారత మార్కెట్లో కి ఆండ్రాయిడ్ హెచ్ డీ టీవీలు

భారత మార్కెట్లో కి ఆండ్రాయిడ్ హెచ్ డీ టీవీలు

బెంగళూరు :థాయ్‌లాండ్‌కు చెందిన ఎల్ఈడీ టీవీ, అప్లియెన్స్ తయారీ సంస్థ ట్రీవ్యూ భారత మార్కెట్లోకి స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టింది. ఈ ఎల్ఈడీ టీవీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లో లభించనున్నాయి. థాయ్‌లాండ్‌కు చెందిన ట్రివ్యూ భారత మార్కెట్లో క్యూత్రీ వెంచర్స్ భాగస్వామ్యంలో స్మార్ట్ ఆండ్రాయిడ్ ఫుల్ హెచ్‌డీ టీవీలను విడుదల చేసింది. వీటిలో 32 ఇంచెస్ నుండి 65 ఇంచెస్ స్క్రీన్ వరకు ఉన్నాయి. స్మార్ట్ యాప్స్ (ఫేస్‌బుక్, యూట్యూబ్ కాస్ట్, మిరాకాస్ట్) వీటితో అనుసంధానమై ఉంటాయని కంపెనీ తెలిపింది. వీటన్నింటి మీద ఏడాది రీప్లేస్‌మెంట్ వారెంటీ, దేశవ్యాప్త సర్వీసింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. తమతో భాగస్వామ్యం ఉన్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ స్టోర్స్‌లో ఇవి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

ఈ టీవీలకు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. 32 ఇంచెస్ నుంచి 65 ఇంచెస్ స్క్రీన్‌‍లలో లభ్యమయ్యే ఈ స్మార్ట్ టీవీల ధరలు రూ.11,990 ప్రారంభమై రూ.45,990 వరకు ఉన్నాయి. నాన్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీల ధరలు రూ.6,990 నుండి రూ.రూ.8,990 వరకు ఉన్నాయి. ఇవి 24 ఇంచుల నుంచి 32 ఇంచెస్ వరకు ఉన్నాయి. అలాగే నాన్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీలను సైతం విడుదల చేసింది. క్యూత్రీ వెంచర్స్ భాగస్వామ్యంతో ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోపియన్, కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. 

 లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.  

  


logo