గురువారం 09 జూలై 2020
National - Jun 16, 2020 , 19:05:51

1.4శాతం తగ్గిన ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ అంచనా

1.4శాతం తగ్గిన ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ అంచనా

అమరావతి : కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ అంచనాలను 1.4శాతానికి తగ్గించినట్లు ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. మంగళవారం ఆ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ (2020-21)ను అసెంబ్లీలో ఆయన ప్రవేశపెట్టి మాట్లాడారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఖర్చు చేసేందుకు రూ.2,24,789కోట్లతో అంచనా బడ్జెట్‌ రూపొందించిందని తెలిపారు.  రెవెన్యూ లోటు అంచనా రూ.18,434.15కోట్లుగా ఉందని, ఆర్థిక లోటు అంచనా రూ.48,295.58 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. స్థూల నికర రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ)లో ఆర్థికలోటు  4.78శాతంగా ఉందని, రెవెన్యూ లోటు 1.82శాతంగా ఉందని స్పష్టం చేశారు. బడ్జెట్‌లో వైసీపీ ప్రభుత్వం నేరుగా బదలాయింపు పథకాలను ప్రాధాన్యం ఇచ్చింది. ఈ కోవలోని పథకాలకు దాదాపు రూ.37,659.5కోట్లను కేటాయించింది. ఎస్టీ సంక్షేమానికి రూ.1840.71కోట్లు కేటాయించగా ఎస్సీల సంక్షేమానికి  రూ.7,525కోట్లు, కాపుల సంక్షేమానికి రూ.2,845కోట్లు, బీసీల సంక్షేమానికి 23,406.81కోట్లు మైనార్టీల సంక్షేమానికి రూ.1,998.55 కోట్లు కేటాయించింది. వ్యవసాయానికి రూ.11,891.20కోట్లు, విద్యారంగానికి రూ.22,604,01కోట్లు, ఆరోగ్యానికి 11,419.48కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. logo