శనివారం 28 మార్చి 2020
National - Feb 12, 2020 , 11:15:30

కరోనా సోకిందనే భయంతో చిత్తూరు వాసి ఆత్మహత్య

కరోనా సోకిందనే భయంతో చిత్తూరు వాసి ఆత్మహత్య

చిత్తూరు : కరోనా వైరస్‌ సోకిందనే భయంతో ఓ 54 వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని తొట్టంబేడు మండలం శేషమనాయుడు కండ్రిగ అరుంధతివాడలో నిన్న చోటు చేసుకుంది. వ్యవసాయ కూలీ అయిన కె. బాలకృష్ణ(54)కు గుండెజబ్బు ఉంది. దీంతో గతేడాది నుంచి ఆయన వైద్యం చేయించుకుంటున్నాడు. అయితే అనారోగ్య కారణాలతో తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన మామను చూసేందుకు బాలకృష్ణ ఇటీవలే అక్కడకు వెళ్లాడు. ఆస్పత్రికి వచ్చాను కదా అని అక్కడ ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా, మూత్ర సంబంధిత వ్యాధి, నోటి అల్సర్‌ ఉన్నట్టు వైద్యులు చెప్పారు. అప్పట్నుంచి బాలకృష్ణ ముభావంగా ఉండడం, తనకు ఏదో వైరస్‌ సోకిందని, అది కరోనా అయి ఉండొచ్చని అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో సొంతూరుకు తిరిగొచ్చిన బాలకృష్ణ.. తనకు కరోనా సోకిందని, ఎవరూ ముట్టుకోవద్దని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఈ వైరస్‌ తన కుటుంబంతో పాటు గ్రామస్తులకు సోకే అవకాశం ఉందని భావించిన బాలకృష్ణ సోమవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 


logo