శనివారం 04 జూలై 2020
National - Jun 15, 2020 , 18:11:15

జూలై 6న ఏపీ శాసనమండలి స్థానానికి ఉప ఎన్నిక

జూలై 6న ఏపీ శాసనమండలి స్థానానికి ఉప ఎన్నిక

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఖాళీ అయిన లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ (శాసనమండలి) స్థానానికి జూలై 6న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల కమిషన్‌ సోమవారం ప్రకటించింది. ఎమ్మెల్యే కోటా స్థానానికి ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 25న తుది గడవుగా పేర్కొంది. లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడు డొక్కా మాణికేశ్వర వరప్రసాద్‌ మార్చి 9న తన పదివికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అవ్వడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2020 మార్చి 29న ఆయన పదవీ కాలం ముగియనుంది. కరోనా నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లను జాగ్రత్తగా పర్యవేక్షించాలని, అన్ని నియమాలు పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను జాగ్రత్తగా పూర్తి చేయాలని ఆ రాష్ట్ర సీఎస్‌తోపాటు డిప్యూటీ సీనియర్‌ అధికారికి భారత ఎన్నికల కమిషన్‌ సూచించింది.  


logo