రిలయన్స్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద జూ.. ఎక్కడంటే..?

న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రానికి మరో గుర్తింపు రానుంది. ఇప్పటికే ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం యునిటీ ఆఫ్ స్టాచ్యూతో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆ రాష్ట్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఆధ్వర్యంలో మరో నిర్మాణం ప్రారంభం కాబోతున్నది. జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద జంతుప్రదర్శనశాల (జూ)ను నిర్మించేందుకు రిలయన్స్ సంస్థ సన్నాహాలు చేస్తున్నది. జామ్‌నగర్‌లో రిఫైనరీని నిర్వహిస్తున్న ఆర్ఐఎల్ ఈ అతిపెద్ద జూను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారి ధ్రువీకరించారు.
‘అసోచాం ఫౌండేషన్ వీక్ 2020’లో భాగంగా నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్‌లో సీఎంఓ అదనపు కార్యదర్శి ఎంకే దాస్ గుజరాత్‌పై ప్రెజెంటేషన్ ఇస్తూ ఈ ప్రకటన చేశారు. జంతువుల సంఖ్య, జాతులపరంగా జామ్‌నగర్‌లో ఒకేచోట ప్రపంచంలోనే అతిపెద్ద జూ రాబోతున్నదని దాస్ వెల్లడించారు. ఈ జూ ఏర్పాటుకు సెంట్రల్ జూ అథారిటీ (సీజెడ్ఏ) ఆమోదం తెలిపింది. సీజెడ్ఏ వార్షిక నివేదిక ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గుజరాత్‌లోని జామ్‌నగర్ వద్ద ‘గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ కింగ్డమ్’ అనే పేరుతో మెగా జూను జూను ఏర్పాటు చేయబోతున్నది. ఈ జూ 250.1 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ కలల ప్రాజెక్టు. ఈ జూను కంపెనీ రిఫైనరీ ప్రాజెక్టుకు దగ్గరగా ఉన్న మోతీ ఖవ్డీ వద్ద నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ మాస్టర్ (లేఅవుట్) ప్రణాళికతోపాటు సమర్పించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను ఫిబ్రవరి 12, 2019న నిర్వహించిన సెంట్రల్ జూ అథారిటీ 33 వ సమావేశంలో ఆమోదించారు. కొవిడ్-19 కారణంగా ఆలస్యమైన ఈ ప్రాజెక్ట్ ఎలాంటి ఆటంకాలు లేకుంటే రాబోయే రెండేళ్లలో పూర్తవుతుందని ఆర్ఐఎల్ డైరెక్టర్ (కార్పొరేట్ వ్యవహారాలు) పరిమళ్ నాథ్వానీ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
ప్లాస్టిక్ వేస్ట్‌కు బదులుగా చపాతీ విత్ కర్రీ
రైల్వేలో 30వేల మందికి కరోనా
బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు...
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- సరికొత్త రికార్డులకు పెట్రోల్, డీజిల్ ధరలు
- ఎలుక మూతి ఆకారంలో చేప.. ఎక్కడో తెలుసా?
- సంప్రదాయానికి స్వస్తి.. తైవాన్ జామతో దోస్తీ..!
- ప్రభాస్‌తో ఢీ అనేందుకు సిద్ధమైన తమిళ హీరో
- కబడ్డీ.. కబడ్డీ.. అదరగొట్టెన్ అదనపు కలెక్టర్
- కాలినడకన తిరుమల కొండెక్కిన జబర్దస్త్ నటుడు
- అన్నాహజారేతో మహారాష్ట్ర మాజీ సీఎం భేటీ
- క్యారెక్టర్ ఎమోజీ పొందిన తొలి భారతీయ నటి సమంత !
- ఈత చెట్టుపై వాలి.. కల్లు తాగిన చిలుక
- రేపు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష