శనివారం 11 జూలై 2020
National - Jul 01, 2020 , 17:42:09

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా ఆనందీబెన్ పటేల్‌ ప్రమాణ స్వీకారం

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా ఆనందీబెన్ పటేల్‌ ప్రమాణ స్వీకారం

భోపాల్‌:  మధ్యప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా ఆనందీబెన్ పటేల్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజయ్ కుమార్ మిట్టా ఆమెతో ఈ మేరకు ప్రమాణం చేయించారు. మధ్యప్రదేశ్‌ ప్రస్తుత గవర్నర్‌ లాల్జీ టాండన్‌కు ఇటీవల శస్త్రచికిత్స జరుగడంతో లక్నోలోని దవాఖానలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌గా ఉన్న ఆనందీబెన్‌ పటేల్‌కు మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను కేంద్రం అప్పగించింది. 

దీంతో బుధవారం లక్నో నుంచి భోపాల్‌ వచ్చిన ఆనందీబెన్‌ పటేల్‌ మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. లాల్జీ టాండన్‌ కోలుకునే వరకు రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఆమె వ్యవహరిస్తారు. ఆనందీబెన్ పటేల్‌ ఉత్తరప్రదేశ్‌కు బదిలీకాక ముందు మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా ఉన్నారు. మరోవైపు సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ గురువారం తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరిన 22 ఎమ్మెల్యేల్లో పది మందికి మంత్రి పదవులు దక్కవచ్చని సమాచారం. గవర్నర్‌ ఆనందీబెన్‌ వీరితో ప్రమాణం చేయిస్తారు. 22 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో సీఎం కమ‌ల్‌ నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోయిన సంగతి తెలిసిందే.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo