బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 20, 2020 , 22:15:07

పహిల్వాన్‌ పరోటా..100 పర్సెంట్‌ జెన్యూన్‌ ఫేక్‌ షాప్‌..!ఫొటోలు వైరల్‌

పహిల్వాన్‌ పరోటా..100 పర్సెంట్‌ జెన్యూన్‌ ఫేక్‌ షాప్‌..!ఫొటోలు వైరల్‌

హైదరాబాద్‌: మహీంద్రా గ్రూప్స్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర ట్విట్టర్‌లో పెట్టే పోస్టులు వైరల్‌ అవుతుంటాయి. ఈ ఆదివారం ఆయన పెట్టిన రెండు ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలకు చాలామంది సరదా కామెంట్లు చేయగా, పెద్ద సంఖ్యలో షేర్‌ చేశారు.

ఆయన పెట్టిన మొదటి ఫొటో పహిల్వాన్‌ పరోటా.. ఇది పంజాబీ అల్పాహారం అంటూ ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేశారు. ఓ పంజాబీ వ్యక్తి టేబుల్‌ అంత వెడల్పుగల ప్లేట్‌లో దాని నిండా ఉన్న పరోటా తింటున్న ఫొటో అది. దీనికి ఆనంద్‌ మహీంద్ర సరదా క్యాప్షన్‌ ఇచ్చారు. డాక్టర్‌ డైటింగ్‌లో భాగంగా ఒకే పరోటా తినాలి అని సూచించినప్పుడు అల్పాహారం ఇలా చేయాలి అని రాశారు. ఈ స్ఫూర్తితో తాను కూడా సోమవారం అల్పాహారాన్ని ఇలా చేయొచ్చు.. అని సరదాగా వ్యాఖ్యానించారు. 

మరో ఫొటో ఒక దుకాణానిది. దీని సైన్‌బోర్డుపై ‘100 పర్సెంట్‌ జెన్యూన్‌ ఫేక్‌ షాప్’ అని రాసి ఉంది. దుకాణాదారు చాలా తెలివిగా బోర్డు పెట్టాడు. ఇక్క షాపింగ్‌ చేసేటప్పుడు మీరే తెలివిగా ఆలోచించాలి అని రాశారు. ఈ ఫొటోలు పెట్టిన కొద్ది సేపట్లోనే 11,000 లైక్స్‌ వచ్చాయి. చాలామంది సరదా కామెంట్లు చేశారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.