గురువారం 13 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 18:50:52

కీటకాన్ని చూసి అసూయ ప‌డిన ఆనంద్ మ‌హీంద్రా!

కీటకాన్ని చూసి అసూయ ప‌డిన ఆనంద్ మ‌హీంద్రా!

క‌రోనా నేప‌థ్యంలో అంద‌రూ ఇంటి నుంచే వ‌ర్క్ చేస్తున్నారు. ఇంట్లోకి కావాల్సిన స‌రుకుల‌ను బ‌య‌ట‌కు వెళ్ల‌కుండానే ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇంటి బ‌య‌ట‌ అడుగు పెట్టాల్సిన అవ‌స‌రం రావ‌డం లేదు. ఒక‌వేళ పెట్టాల‌న్నా భ‌య‌ప‌డుతున్నారు. వ‌ర్క్‌ఫ్ర‌మ్‌హోమ్ చేసేవాళ్ల ప‌రిస్థితి మ‌రీ ఘోరం. బ‌య‌ట ఆనందంగా ఎగిరే ప‌క్షుల‌ను చూసి అసూయ ప‌డుతున్నారు. వీరిలో ప్ర‌ముఖ వ్యాపార వేత్త ఆనంద్ మ‌హీంద్రా కూడా ఉన్నారు.

ఇటీవల త‌న గ‌దిలో ఒక పెద్ద గుడ్ల‌గూబ చిమ్మ‌ట‌ను చూశారు. అది గ‌ది నుంచి బ‌య‌ట‌కు త‌ప్పించుకునేందుకు చాలా ట్రై చేస్తున్న‌ది. రెక్క‌ల‌ను తీవ్రంగా ఎగ‌ర‌వేస్తూ ప్ర‌య‌త్నిస్తున్న‌ది. దీనికి లోప‌లే ఉన్న ఆనంద్ స‌హాయం చేశారు. తీరా ఆ గుడ్ల‌గూబ చిమ్మ‌ట బ‌య‌ట‌కు ఎగిరిపోవ‌డంతో అసూయ‌తో చూస్తూ ఉండిపోయార‌ట‌. ఎందుకంటే లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉండి విస్తుపోయారు. 'మనమందరం లాక్‌డౌన్‌ చిమ్మటలం.. ఆ డోర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా? ' అనే శీర్షిక‌తో ఈ పోస్టును ట్విట‌ర్ ద్వారా షేర్ చేశారు. 


తాజావార్తలు


logo