గురువారం 09 జూలై 2020
National - Jun 24, 2020 , 18:14:08

త‌మ కంపెనీ ట్ర‌క్‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోయిన ఆనంద్ మ‌హీంద్ర‌!

త‌మ కంపెనీ ట్ర‌క్‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోయిన ఆనంద్ మ‌హీంద్ర‌!

సోష‌ల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పారిశ్రామిక‌వేత్త‌ల‌లో ఆనంద్ మ‌హీంద్రా ఒక‌రు. చుట్టూ జ‌రిగే విష‌యాల‌ను వివ‌రిస్తూ ట్విట‌ర్‌లో షేర్ చేస్తూ ఉంటారు. ఇటీవ‌ల త‌మ కంపెనీ త‌యారు చేసిన ఓ ట్ర‌క్‌ను చూసి ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. సాధారణ లోడ్ కోసం తయారు చేసిన టిప్పర్ ట్రక్కును పెద్ద పెద్ద దుంగలను రవాణా చేయడానికి వాడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ జీపులో ఉన్న పెద్ద పెద్ద మొద్దుల‌ను వారు అన్‌లోడ్ చేసే విధానం చూసి ఆనంద్ మ‌హీంద్రా గుండె త‌రుక్కుపోయింది. మోతాదుకు మించి బ‌రువు వేయ‌డ‌మే కాకుండా ఎలాంటి సేఫ్టీ ఆయుధాలు వాడ‌క‌పోవ‌డం నేర‌మ‌ని వాపోయారు. మొద్దు‌ల‌ను అన్‌లోడ్ చేయ‌డానికి వాహ‌నాన్ని చేతుల‌తో పైకెత్తారు. కూలీలు ముందు ఉండగానే ఆ డ్రైవర్ ఆ టిప్పర్‌ను ముందుకు నడిపి దుంగలను పూర్తిగా అన్‌లోడ్ చేశారు. ఈ వీడియో చూసిన ఆనంద్ మహీంద్ర 'ఇలా ఒట్టి చేతుల‌తో భారీ వ‌స్తువుల‌ను అన్‌లోడ్ చేయ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని తెలిపారు'. ఈ ఘటన కేరళలో చోటుచేసుకున్నట్లు సమాచారం. 


logo