బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 15, 2020 , 17:47:09

ప్ర‌తి ఏడాది ఈ వీడియోను చూడ‌కుండా ఉండ‌లేను : ఆనంద్ మ‌హీంద్రా

ప్ర‌తి ఏడాది ఈ వీడియోను చూడ‌కుండా ఉండ‌లేను : ఆనంద్ మ‌హీంద్రా

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఆయ‌న ఏదైనా వీడియోను పోస్ట్ చేశారంటే దానికో ప్ర‌త్యేక‌త ఉంటుంది. ఈ రోజు ఆగ‌స్ట్ 15 స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఒక వీడియోను ముందురోజే ట్విట‌ర్ ద్వారా పంచుకున్నారు. అంతేకాదు ప్ర‌తి ఏడాది ఈ వీడియోను చూడ‌కుండా ఉండ‌లేర‌ట‌. సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియోను చూడ‌కుంటే ఎలా?

ఒక చిన్న పిల్ల‌వాడు చ‌క్క‌గా నిల‌బ‌డి జ‌న‌గ‌నమ‌ణ అంటూ భార‌త జాతీయ‌గీతం పాడుతున్న వీడియో అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్న‌ది. కొన్ని ప‌దాలు స‌రిగా ప‌ల‌క‌పోయిన‌ప్ప‌టికీ ఎక్క‌డా బ్రేక్ ఇవ్వ‌కుండా పాడి ఆనంద్ మ‌హీంద్రా మ‌న‌సు దోచుకున్నాడు ఈ బుడ్డోడు. అయితే ఈ వీడియో ఇప్ప‌టిది కాదు. కొన్నేండ్ల కింద‌టిది. ఇప్పుడు ఆ పిల్ల‌వాడు పెద్ద‌వాడై ఉండాడు. ఇప్పుడు గ‌నుక ఆ అబ్బాయి మ‌ర‌లా జాతీయ గీతం పాడితే చాలా భిన్నంగా ఉంటుంది అంటున్నారు ఆనంద్‌. ఈ వీడియో త‌న‌కెంతో స్ఫూర్తి కలిగిస్తుందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.

తాజావార్తలు


logo