శుక్రవారం 29 మే 2020
National - Apr 07, 2020 , 20:06:38

వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌.. పైన కోటు కింద లుంగీ : ఆనంద్‌ మహీంద్ర

వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌.. పైన కోటు కింద లుంగీ : ఆనంద్‌ మహీంద్ర

వర్క్‌ ఫ్రమ్‌ చేసేవాళ్లకు చాలా అడ్వాంటేజెస్‌ ఉన్నాయి. ఇంటి నుంచి పని చేసేవారు పూర్తిగా డ్రెస్‌ అప్‌ కావాల్సిన అవసరం లేదు. గంటలు గంటలు ట్రాఫిక్‌లో ప్రయాణించాల్సిన పనిలేదు. స్నానం చేసినా, చేయకపోయినా నడుస్తుంది. అదే ఆఫీసుకు వెళ్లాలంటే టిప్‌టాప్‌గా రెడీ అవ్వాలి. అయితే.. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ గురించి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఒక ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ను చెప్పారు. ఇంటి నుంచి పనిచేసేవారు బాసులతో వీడియో కాన్ఫరెన్స్‌ అటెండ్‌ అవ్వాల్సి వస్తే సగం రెడీ అయితే చాలంటున్నారు. వీడియోలో కనిపించే వరకు కోటు లేదా షర్ట్‌ వేసుకుని కింద లుంగీ ఉన్నా పర్వాలేదంటున్నారు. తాను అలాగే చేస్తున్నాను అని ఆనంద్‌ మహీంద్ర తన ట్విట్టర్‌ వాల్‌పై ట్వీట్‌ చేశారు. 'నేను వ‌ర్క్‌ఫ్ర‌మ్‌హోమ్ చేస్తున్న‌ప్పుడు వీడియోకాల్స్ స‌మ‌యంలో చాలాసార్లు చొక్కా కింద లుంగీ ధ‌రించాను. ఈ ట్వీట్ త‌ర్వాత నా స‌హ‌చ‌రులు న‌న్ను నిల‌బ‌డ‌మ‌ని అడుగుతారేమో అని అనుమానంగా ఉంది' అన్నారు. ఇప్పడీ ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌కు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.


logo