ఆదివారం 06 డిసెంబర్ 2020
National - Nov 07, 2020 , 21:01:14

డబ్బుల కోసం ముఖ్యమంత్రికి బెదిరింపు ఎస్‌ఎంఎస్‌

డబ్బుల కోసం ముఖ్యమంత్రికి బెదిరింపు ఎస్‌ఎంఎస్‌

పనాజి: డబ్బుల కోసం ఒక ముఖ్యమంత్రికి బెదిరింపు ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ వ్యక్తిగత మొబైల్‌కు ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెసేజ్‌ వచ్చింది. డబ్బుల కోసం ఆ వ్యక్తి డిమాండ్‌ చేశాడు. లేకపోతే సీఎంను చంపుతానని బెదిరించాడు. మరోవైపు ఈ మొబైల్‌ మెసేజ్‌పై సీఎం ప్రమోద్‌ సావంత్‌ కార్యాలయం పనాజి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది. దీంతో క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గోవా పోలీసులు తెలిపారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.