శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 17:33:08

అయోధ్య భూమి పూజ‌... 1.25 ల‌క్ష‌ల మ‌ట్టి ప్ర‌మిద‌ల ఆర్డ‌ర్‌

అయోధ్య భూమి పూజ‌... 1.25 ల‌క్ష‌ల మ‌ట్టి ప్ర‌మిద‌ల ఆర్డ‌ర్‌

ల‌క్నో : అయోధ్య‌లో ఈ 5వ తేదీన రామ మందిర నిర్మాణానికి భూమి పూజ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కార్య‌క్ర‌మ నిర్వాహాకులు ల‌క్షా 25 వేల మ‌ట్టి ప్ర‌మిద‌ల‌ను త‌యారు చేయాల్సిందిగా స్థానిక త‌యారీదారుల‌కు ఆర్డ‌ర్ ఇచ్చారు. దీంతో మ‌ట్టికుండ త‌యారీదారులు త‌మ ప‌నిని ప్రారంభించారు. గ్రామంలో ఉన్న సుమారు 40 కుటుంబాల మ‌ధ్య ప‌ని విభ‌జ‌న చేసుకున్న‌ట్లు తెలిపారు. దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు త‌మ ఇళ్ల‌లోనే ఉంటూ భూమి పూజ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వీక్షించాల్సిందిగా రామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. అదేవిధంగా ఆ రోజు సాయంకాలం ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ ఇళ్ల‌లో దీపాలు వెలిగించాల్సిందిగా కోరారు.
logo