ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 07, 2020 , 12:09:04

ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు మంచంపై వృద్ధుడు

ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు మంచంపై వృద్ధుడు

హైద‌రాబాద్‌:  బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇవాళ తుది విడత పోలింగ్ జ‌రుగుతున్న‌ది.  అయితే క‌తిహ‌ర్‌లో ఉన్న ఓ పోలింగ్ బూత్‌కు స్థానికులు ఓ వృద్ధ ఓట‌రును మంచంపై తీసుకువ‌చ్చారు.  బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భారీ స్థాయిలో ఓటింగ్ న‌మోదు అవుతున్న‌ది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వృద్ధ ఓట‌రును.. మంచంపై ప‌డుకోబెట్టి.. పోలింగ్ బూత్‌కు తీసుకువ‌చ్చారు. ఆ వృద్ధుడు త‌న ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు స‌హ‌క‌రించారు. బూత్ లోప‌లి వ‌ర‌కు ఆ వృద్ధుడిని మంచంపై ఎత్తుకు రావ‌డం గ‌మ‌నార్హం. మూడో ద‌శ‌లో 74 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గుతున్నాయి. ఇవాళ ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు 20 శాతం పోలింగ్ జ‌రిగింది. ఇక ఔరాయిలోని పోలింగ్ బూత్‌లో ఆ బూత్ ఆఫీస‌ర్ గుండెపోటుతో మ‌ర‌ణించాడు. రాష్ట్ర ప్ర‌జ‌లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని ఇవాళ ఉద‌యం సీఎం నితీశ్ కుమార్ త‌న ట్వీట్‌లో కోరారు.