ఆదివారం 07 జూన్ 2020
National - Mar 31, 2020 , 16:26:08

కేరళలో కరోనాను జయించిన వృద్ద దంపతులు

కేరళలో కరోనాను జయించిన వృద్ద దంపతులు

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో వృద్ద దంపతులు కరోనాను జయించారు. ఇదే విష‌యాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. ఆ వృద్ద దంప‌తుల‌కు బీపీ, షుగ‌ర్‌తో పాటు ఇత‌ర స‌మ‌స్య‌లున్నా కూడా క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డార‌ని వివ‌రించారు. కేర‌ళ రాష్ట్రంలోని ప‌త‌నంతిట్ట జిల్లా రాన్ని ప్రాంతానికి చెందిన వృద్ద దంప‌తుల‌కు క‌రోనా వైర‌స్ సోకింది. అయితే ఇటీవ‌లే  ఇట‌లీకి వెళ్లివ‌చ్చిన ఆ దంప‌తులు...  త‌మ కుమారుడితో క‌లిసి ఇండియాకు తిరిగివ‌చ్చినట్లు అధికారులు గుర్తించారు. త‌ర్వాత వీరితో పాటు కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందింది. దీంతో వారిని కొట్టాయం మెడికల్ కాలేజీలో ఉంచి చికిత్స అందించారు. వైద్యులు ఇచ్చిన స‌లహాలు క్ర‌మం త‌ప్ప‌కుండా పాటించ‌డంతో వీరు ప్రాణాప్రాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డార‌ని వైద్యులు తెలిపారు. మొత్తానికి మాన‌సికంగా ధృడంగా ఉంటే ఎంత‌టి మ‌హ‌మ్మారినైనా ఎదిరించ‌వ‌చ్చ‌ని వృద్ద దంప‌తులు చేసి చూపించారు.


logo