సోమవారం 21 సెప్టెంబర్ 2020
National - Sep 05, 2020 , 15:49:36

మ‌హిళ‌లే ల‌క్ష్యంగా మోసాలు.. ఢిల్లీలో చీట‌ర్‌ అరెస్ట్‌‌

మ‌హిళ‌లే ల‌క్ష్యంగా మోసాలు.. ఢిల్లీలో చీట‌ర్‌ అరెస్ట్‌‌

న్యూఢిల్లీ: అంత‌ర్రాష్ట్ర స్థాయిలో పేరుమోసిన మోస‌గాడు వికాస్ అలియాస్ మోహిత్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెండ్లి పేరుతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప‌లువురు మ‌హిళ‌ల‌ను వికాస్ మోసం చేశాడ‌ని,  విడాకులు తీసుకున్న మ‌హిళ‌లే ల‌క్ష్యంగా అత‌ని మోసాలు కొన‌సాగుతున్నాయ‌ని పోలీసులు చెప్పారు. పెండ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి మ‌హిళ‌ల‌ నుంచి డ‌బ్బు గుంజ‌డంలో వికాస్ ఆరితేరాడ‌ని తెలిపారు. వికాస్ పేరుమీద నాలుగు బ్యాంకు అకౌంట్లు ఉన్నాయ‌ని, ఆ నాలుగు అకౌంట్ల‌లో క‌లిపి రూ.4.5 ల‌క్ష‌ల న‌గ‌దు జ‌మచేసి ఉన్న‌దని పోలీసులు వెల్ల‌డించారు. కేసు ద‌ర్యాప్తు జ‌రుగుతున్న‌ద‌ని, ఈ నేరాల్లో అత‌నికి స‌హ‌క‌రించిన మ‌రికొంద‌రిని అరెస్టు చేసేందుకు గాలింపు కొన‌సాగుతున్న‌ద‌ని చెప్పారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo