బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 02:20:27

యూపీలో మరో ‘నిర్భయ’ ఘటన

యూపీలో మరో ‘నిర్భయ’ ఘటన

మీరట్‌: ఉత్తరప్రదేశ్‌లో ‘నిర్భయ’ లాంటి ఘటన జరిగింది. కదిలే బస్సులోనే డ్రైవర్‌, కండక్టర్‌ ఓ మహిళపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మీరట్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళ (35) తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లడానికి శుక్రవారం రాత్రి బస్సు ఎక్కారు. ఆ బస్సులో ఆమెతోపాటు డ్రైవర్‌, కండక్టర్‌ మాత్రమే ఉన్నారు. దీంతో కూల్‌డ్రింక్‌లో మత్తు పదార్థాన్ని కలిపిన డ్రైవర్‌, కండక్టర్‌ ఆమెకు తాగించి లైంగికదాడికి పాల్పడ్డారు.


logo