గురువారం 09 జూలై 2020
National - Jun 29, 2020 , 15:00:04

ఉచితంగా శానిట‌రీ న్యాప్ కిన్లు పంపిణీ

ఉచితంగా శానిట‌రీ న్యాప్ కిన్లు పంపిణీ

శ్రీన‌గ‌ర్ : ఓ మ‌హిళా ఉద్యోగి త‌న గొప్ప మ‌న‌సును చాటుకున్నారు. త‌న లాంటి మ‌హిళ‌ల‌కు అండ‌గా నిలిచారు. శ్రీన‌గ‌ర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లో ప‌ని చేస్తున్న ఓ మ‌హిళా ఉద్యోగి.. ఎవా మెడి కిట్స్ పేరుతో శానిట‌రీ న్యాప్ కిన్స్, లిక్విడ్ సోప్స్ ను పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికీ ఆమె తిరుగుతూ.. ఈ కిట్స్ ను అంద‌జేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా మ‌హిళా ఉద్యోగి మాట్లాడుతూ.. ఈ వ‌స్తువులు కొనేందుకు చాలా మంది మ‌హిళ‌లు ముందుకు రావ‌డం లేదు. నెల‌కు వ‌చ్చే జీతం డ‌బ్బుల‌తో ఈ కిట్స్ ను కొని మ‌హిళ‌ల‌కు అందిస్తున్నాన‌ని ఆమె తెలిపారు. 


logo