శనివారం 05 డిసెంబర్ 2020
National - May 13, 2020 , 17:56:23

327 మందితో లండ‌న్ నుంచి అహ్మ‌దాబాద్‌కు‌

327 మందితో లండ‌న్ నుంచి అహ్మ‌దాబాద్‌కు‌

న్యూఢిల్లీ: యూకేలో చిక్కుకున్న 327 మంది భార‌తీయుల‌తో ఎయిరిండియా విమానం ఒక‌టి భార‌త్‌కు బ‌య‌లురేరింది. ఈ విమానం రేపు తెల్ల‌వారుజామున అహ్మ‌దాబాద్‌కు చేరుకోనుంది. లాక్‌డౌన్ కార‌ణంగా విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకురావ‌డం కోసం కేంద్ర ప్ర‌భుత్వం వందేభార‌త్ మిష‌న్ పేరుతో ఒక బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. ఇందులో భాగంగా మే 7న మొద‌టి ద‌శ త‌ర‌లింపు కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. ఇప్ప‌టిర‌కు 8500 మందిని స్వ‌దేశానికి చేర్చారు. మే 16 నుంచి రెండో ద‌శ మొద‌లు కానుంది. రెండో ద‌శ‌లో 31 దేశాల్లోని భార‌తీయుల‌ను భార‌త్‌కు చేర్చ‌నున్నారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..