శుక్రవారం 03 జూలై 2020
National - Jun 24, 2020 , 13:32:52

వలస కూలీలు, నిరుపేదలకు పాదరక్షలు దానం చేసిన నటి

వలస కూలీలు, నిరుపేదలకు పాదరక్షలు దానం చేసిన నటి

న్యూ ఢిల్లీ : కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో వేల మంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు కాలినడకన వెళ్లిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో నటి భూమి పెడ్నేకర్‌ సొంత ప్రాంతాలకు వెళ్తున్న వలస కూలీలు, నిరుపేదలకు అండగా నిలిచారు. కొంతమంది కాళ్లకు చెప్పులు లేకుండా వెళ్తుండడాన్ని గమనించిన ఈ నటి వారికి పాదరక్షలను అందజేశారు. 

బాలివుడ్‌లో ‘పతి పత్ని అవుర్‌ వో’ అనే చిత్రంలో నటించిన భూమి పెడ్నేకర్‌ నిరుపేదలకు సాయం చేయడానికి ఓ ఫుట్‌వేర్‌ కంపెనీతో చేతులు కలిపింది.  గజియాబాద్‌ పరిధిలోని మురద్‌నగర్‌, గోవిందాపురం, విజయ్‌నగర్‌లోని సుమారు 1000 మంది నిరుపేద వలస కూలీలకు (మహిళలు, పురుషులు) వారి వయస్సును బట్టి పాదరక్షలను అందజేసి మంచి మనుస్సును చాటుకుంది. 


logo