శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 21, 2020 , 13:31:32

డచ్‌ విమానానికి అనుమతివ్వని డీజీసీఏ

డచ్‌ విమానానికి అనుమతివ్వని డీజీసీఏ

న్యూఢిల్లీ : ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే విమానాలపై కేంద్ర విమానయాన శాఖ నిషేధం విధించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆమ్‌స్టర్‌డ్యామ్‌ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయానికి వచ్చిన కేఎల్‌ఎమ్‌ రాయల్‌ డచ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి ల్యాండ్‌ అయ్యేందుకు డీజీసీఏ అనుమతి ఇవ్వలేదు. ఆమ్‌స్టర్‌డ్యామ్‌ నుంచి బయల్దేరిన కేఎల్‌0871 విమానంలో 90 మంది భారతీయులు ఉన్నారు. కేఎల్‌0871 విమానానికి ప్రయాణ అనుమతి లేదని డీజీసీఏ అధికారులు తెలిపారు.

యూరోపియన్‌ యూనియన్‌ దేశాల నుంచి వచ్చే విమానాలపై మార్చి 18వ తేదీ నుంచి భారత విమానయాన శాఖ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధనలను కేఎల్‌ఎమ్‌ విమానం ఉల్లంఘించిన నేపథ్యంలోనే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యేందుకు అనుమతించలేదు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని అంతర్జాతీయ టెర్మినల్‌ను రేపట్నుంచి మూసివేయనున్నారు. 29వ తేదీ వరకు ఈ నిబంధన అమల్లో ఉండనుంది. ఇటలీ, స్పెయిన్‌తో పాటు ఇతర దేశాల్లో కరోనా వైరస్‌ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో.. అక్కడ్నుంచి వచ్చే విమానాలపై భారత్‌ నిషేధం విధించింది. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 3,407కు చేరింది. 


logo