శనివారం 06 జూన్ 2020
National - May 18, 2020 , 00:25:59

తీవ్ర తుఫాన్‌గా ‘ఉమ్‌ పున్‌'

తీవ్ర తుఫాన్‌గా ‘ఉమ్‌ పున్‌'

  • 20న పశ్చిమ బెంగాల్‌ సమీపంలో తీరం దాటే అవకాశం 

న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఉమ్‌ పున్‌' తుఫాన్‌ తీవ్రరూపం దాల్చనున్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎం  అధికారులు తెలిపారు. ప్రస్తుతం దక్షిణ పారాదీప్‌(ఒడిశా)కు 990 కిమీ దూరంలో ఉన్నదని, సోమవారం ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా మారనున్నదన్నారు. తర్వాత ఉత్తర దిశగా ప్రయాణించి ఈశాన్య బంగాళాఖాతంవైపు వంపు తిరుగుతుందని భావిస్తున్నారు. దీంతో ఈ నెల 20న సాగర్‌ దీవులు (పశ్చిమ బెంగాల్‌), హతియా దీవులు (బంగ్లాదేశ్‌) మధ్య తుఫాన్‌ తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో ఈ ప్రాంతంలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయన్నారు. బెంగాల్‌, ఒడిశాపై ‘ఉమ్‌ పున్‌' ప్రభావం ఉంటుంద  మరోవైపు, అమెరికాలోని ఫ్లోరిడా తీ  సమీపంలో ‘ఆర్థర్‌' తుఫాన్‌ ఏర్పడింది. జూన్‌ 1కి ముందు అట్లాంటిక్‌ సముద్రంలో వరుసగా సంభవించిన ఆరో తుఫాన్‌ ఇది.


logo