గురువారం 28 మే 2020
National - May 18, 2020 , 16:04:01

ముంచుకొస్తున్న ఉమ్‌పున్‌ తుఫాన్‌.. ఒడిశా, బెంగాల్‌ కు NDRF బలగాలు

ముంచుకొస్తున్న ఉమ్‌పున్‌ తుఫాన్‌.. ఒడిశా, బెంగాల్‌ కు NDRF బలగాలు

న్యూఢిల్లీ: ఉమ్ పున్ తుఫాన్‌ తీరం వైపు దూసుకొస్తున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుఫాన్‌ గా మారింది. ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో ఈ తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉండనున్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో సైతం దీని ప్రభావంతో వర్సాలు కురుస్తున్నాయి. కర్ణాటకలోని మంగళూరులో భారీ వర్షం కురిసింది. ఇదిలావుంటే ఉమ్‌ పున్‌ తీరం వైపు వేగంగా వస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 37 NDRF టీమ్‌లను ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు తరలించినట్లు ఆ విభాగం డీజీ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ తెలిపారు. మరోవైపు తుఫాను పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోదీ సంబంధిందిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.


logo