శుక్రవారం 05 జూన్ 2020
National - May 17, 2020 , 11:09:59

మే 20న తీరాన్ని తాక‌నున్న అంఫాన్ తుఫాన్

మే 20న తీరాన్ని తాక‌నున్న అంఫాన్ తుఫాన్

కోల్‌క‌తా: బ‌ంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం క్ర‌మంగా బ‌ల‌ప‌డి తీవ్ర వాయుగుండంగా మారింది. మ‌రికొన్ని గంట‌ల్లో ఈ వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా మార‌నుంది. అంఫాన్‌గా పేరుపొందిన ఈ తుఫాన్ మే 20న ప‌శ్చిమ‌బెంగాల్‌లోని సాగ‌ర్ ఐలాండ్స్‌, బంగ్లాదేశ్‌లోని హ‌తియా ఐలాండ్స్ మ‌ధ్య తీరాన్ని తాకే అవ‌కాశం ఉన్న‌ద‌ని భార‌త‌ వాతావ‌ర‌ణ విభాగం అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ బంగ్లాదేశ్‌తోపాటు దేశంలోని ప‌శ్చిమ‌బెంగాల్‌, ఒడిశా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ తీర ప్రాంతాల‌పై కూడా తీవ్ర ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని భుశ‌నేశ్వ‌ర్‌లోని ఐఎండీ అధికారి హెచ్ఆర్ బిశ్వాస్ చెప్పారు. ఈ ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు తీర ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు, మ‌త్స్య‌కారుల‌కు ఒక‌టో నెంబ‌ర్ ప్ర‌మాద హెచ్చ‌రిక‌లు జారీ చేశాయి. ‌logo