సోమవారం 06 జూలై 2020
National - Jun 18, 2020 , 16:08:01

అమ్మా క్యాంటీన్ల ద్వారా చెన్నైలో ఉచితంగా ఆహారం

అమ్మా క్యాంటీన్ల ద్వారా చెన్నైలో ఉచితంగా ఆహారం

చెన్నై: తమిళనాడు సీఎం కే పళనిస్వామి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో చెన్నై మెట్రోపాలిటన్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని ప్రజలకు అమ్మా క్యాంటీన్ల ద్వారా ఉచితంగా ఆహారం అందిస్తామని గురువారం తెలిపారు. ఆ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో ఈ నెల 19 నుంచి 30 వరకు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు సీఎం కే పళనిస్వామి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో శుక్రవారం నుంచి పది రోజుల పాటు మళ్లీ లాక్‌డౌన్‌ విధించనున్నారు. ఈ నేపథ్యంలో పేద ప్రజలు ఇబ్బంది పడకుండా అమ్మా క్యాంటీన్ల ద్వారా ఆహారం అందించాలని నిర్ణయించారు. logo