శుక్రవారం 10 జూలై 2020
National - Jun 15, 2020 , 17:11:39

ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిని పరిశీలించిన అమిత్‌ షా

ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిని పరిశీలించిన అమిత్‌ షా

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికమవుతున్న నేపథ్యంలో అటు కేంద్రం, ఇటు ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఎప్పటికప్పుడు ఢిల్లీ అధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహించి.. తగు సూచనలు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిని అమిత్‌ షా పరిశీలించారు. ఆ ఆస్పత్రి డాక్టర్లతో ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. 

సోమవారం ఉదయం ఢిల్లీలో కరోనా పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఢిల్లీ ప్రజలందరికీ కొవిడ్‌-19 టెస్టులు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. అంతేకాకుండా కంటైన్‌మెంట్‌ జోన్‌లోని ప్రతి కుటుంబానికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని డిమాండ్‌ చేసినట్లు సమాచారం. 


logo