మంగళవారం 14 జూలై 2020
National - Jun 21, 2020 , 18:55:41

ఢిల్లీలో కరోనా పరిస్థితిపై అమిత్‌ షా సమీక్ష

ఢిల్లీలో కరోనా పరిస్థితిపై అమిత్‌ షా సమీక్ష

న్యూఢిల్లీ : ఢిల్లీలో రోజురోజుకూ కరోనా ఉద్ధృతమవుతోంది. దీంతో ఆ రాష్ట్రంలో పరిస్థితిపై కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణపై పోరుకు కేంద్రం పూర్తిగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే ర్యాపిడ్‌ కరోనా పరీక్షలు జరుగుతున్నాయని, కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారిని వెంటనే క్వారంటైన్‌కు పంపుతున్నామని, కాంటాక్టులను గుర్తించేందుకు అధికారులు సత్వరం చర్యలు తీసుకుంటున్నారని సీఎం కేజ్రీవాల్‌ వివరించారు. దేశరాజధానిలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పరిస్థితిపై నిత్యం సమీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఆదివారం ఒక్కరోజే అత్యధికంగా 3,630 కరోనా కేసులు నమోదయ్యాయని, ఇప్పటి వరకు 56,746 నమోదయ్యాయని ప్రభుత్వం బులిటెన్‌లో వెల్లడించింది. 


logo