గురువారం 09 జూలై 2020
National - Jun 15, 2020 , 11:25:15

అమిత్‌ షా నేతృత్వంలో ఢిల్లీ అఖిలపక్ష సమావేశం

అమిత్‌ షా నేతృత్వంలో ఢిల్లీ అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ముప్పు క్రమంగా తీవ్రమవుతుండంతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దృష్టిసారించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నిన్న కేంద్ర హోం మంత్రి హర్షవర్ధన్‌, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. ఈ రోజు ఆయన నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌, ఢిల్లీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ చౌదురి, ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. ఢిల్లీలో కరోనా వైరస్‌ను కట్టడిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.   

నిన్న జరిగిన సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నారు. ఢిల్లీలో కరోనా నిర్ధారణ పరీక్షలను రెండు రోజుల్లో రెట్టింపు చేయాలని, కంటెయిన్‌మెంట్‌ జోన్లలోని ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో కొద్దిరోజుల్లో కరోనా పరీక్షలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కరోనా రోగులకు చికిత్స అందించడానికి తక్షణమే 500 రైలు బోగీలను డిల్లీ ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయించారు. కంటెయిన్‌మెంట్‌ జోన్లలో కాంటాక్ట్‌ మ్యాపింగ్‌ చేపట్టడానికి వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రతి వ్యక్తి ఆరోగ్యం గురించి సర్వే చేయనున్నారు.


logo