మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 13:53:35

'ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ -2020' ప్రారంభించిన అమిత్‌షా

'ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ -2020' ప్రారంభించిన అమిత్‌షా

న్యూ ఢిల్లీ : కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘టీ ప్లాంటేషన్‌ డ్రైవ్‌-2020’ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవ్ కింద పది రాష్ట్రాల్లో 38 జిల్లాల్లోని ఆరువేల ఎకరాల భూముల్లో మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. ‘నేడు 150 చోట్ల 600 ఎకరాల భూమిలో మొక్కలు నాటుతారని, ఐదు లక్షల మొక్కలు పంపిణీ చేస్తాం’ అని చెప్పారు. ప్రకృతి మన తల్లిలాంటిదని, అభివృద్ధి అంధకారంలో పడి భారతీయ సంస్కృతి అనే మంత్రాన్ని మరిచిపోతున్నామన్నారు. భూమి ఉష్ణోగ్రత పెరిగి, వాతావరణంపై చెడు ప్రభావం చూపుతోందని, వాతావరణ మార్పుల పట్ల ప్రపంచం భయపడుతుందన్నారు.

చెట్లు మానవ మిత్రులని, కేవలం చెట్లు మాత్రమే మనల్ని కాపాడగలవని మన పురాణాలు చెప్పాయని, భారతీయ సంస్కృతి చెట్ల ప్రాముఖ్యతను గుర్తించి ప్రోత్సహించిందన్నారు. ఈ సందర్భంగా బొగ్గు గనుల మంత్రిత్వశాఖ చేపట్టిన పలు కార్యక్రమాలను హోం మంత్రి ప్రసంశించారు. ‘బొగ్గు, ఖనిజ గనుల కార్మికుల గురించి ఎవరూ పట్టించుకోలేదన్నారు. జిల్లా ఖనిజ నిధి ఏర్పాటు తర్వాత ప్రభుత్వం గనులు ఏర్పాటు చేసిన ప్రాంతం అభివృద్ధి కోసం రూ.49వేల కోట్లు ఖర్చు చేసింది’ అని చెప్పారు. హోంమంత్రి లోకమాన్య బాల గంగాధర్ తిలక్, చంద్ర శేఖర్ ఆజాద్‌ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యోద్యమంలో తిలక్ చేసిన కృషిని ఎవరూ మరువలేరని, ఆయన నినాదం ‘నా జన్మహక్కు’ అనే నినాదం ఇప్పటికీ భారత యువతకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo