సోమవారం 06 జూలై 2020
National - Jun 27, 2020 , 18:24:56

కరోనా సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర హోంమంత్రి

కరోనా సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర హోంమంత్రి

న్యూఢిల్లీ : ఢిల్లీలోని చిత్తార్‌పూర్‌ రాధా సొయామి బీస్‌లో ఏర్పాటు చేసిన కరోనా సంరక్షణ కేంద్రాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో కలిసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సందర్శించారు.  పదివేల పడకలతో ఏర్పాటు చేసిన ఈ కరోనా సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించేందుకు రావాలని గతంలో అమిత్‌షాకు కేజ్రీవాల్‌ లేఖ రాశారు. ఇండో-టిబెటిన్‌ సరిహద్దులో ఇండో టిబెటిన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ), ఆర్మీ కేంద్రాల్లో డాక్టర్లు, నర్సులను నియమించాలని కోరారు.

రాధాసోయామి బీస్‌లో ఏర్పాటు చేసిన ఈ అతిపెద్ద కరోనా సంరక్షణ కేంద్రం నిర్వహణలో 2వేల ఇండో-టిబెటిన్‌ పోలీసు సిబ్బంది, కేంద్ర రక్షణ పోలీస్‌ దళాలు, డాక్టర్లు పాల్పంచుకుంటున్నారని సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. శుక్రవారం ఈ కరోనా సంరక్షణ కేంద్రంలో ఏర్పాట్లను ఇండో-టిబెటిన్‌ బోర్డర్‌ పోలీస్‌ డీజీ ఎస్‌ఎస్‌ దేస్‌వాల్‌ పరిశీలించారు. 10వేల మందికి సేవలందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా దేశరాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తున్నది. ఇప్పటి వరకు 77,249 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంరక్షణ మంత్రిత్వశాఖ తన నివేదికలో వెల్లడించింది. 


logo