గురువారం 04 మార్చి 2021
National - Jan 27, 2021 , 16:13:09

అమిత్‌ షా నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష

అమిత్‌ షా నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం జరిగిన ఆందోళనల నేపథ్యంలో శాంతిభద్రతలపై బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశానికి హాజరైన హోంశాఖ కార్యదర్శి, ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌, ఐబీ చీఫ్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు ఘటనపై సవివరంగా నివేదికను అందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. అల్లర్ల కేసులో ఢిల్లీ పోలీసులు సుమారు 200 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 22 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మంగళవారం జరిగిన హింసలో సుమారు 300 మంది పోలీసులు గాయపడ్డారు. హింసకు పాల్పడిన రైతులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలుంటాయని పోలీసులు తెలిపారు. మరో వైపు ట్రాక్టర్‌ పరేడ్‌ సందర్భంగా చోటు చేసుకున్న హింసపై చర్చించేందుకు కిసాన్‌ మోర్చా బుధవారం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సింగు సరిహద్దులో జరిగే ఈ సమావేశంలో 32 మంది పంజాబ్‌కు చెందిన రైతు సంఘాల నేతలు పాల్గొనున్నారు.   

VIDEOS

logo