మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 15, 2020 , 12:36:22

ఢిల్లీలో క‌రోనా కేసులు.. అమిత్‌షా అత్య‌వ‌స‌ర స‌మావేశం

ఢిల్లీలో క‌రోనా కేసులు.. అమిత్‌షా అత్య‌వ‌స‌ర స‌మావేశం

న్యూఢిల్లీ: దేశ ‌రాజ‌ధానిలో క‌రోనా కేసులు పెరుగుతున్న‌ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అత్య‌వ‌స‌ర స‌మావే‌శం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి ఢిల్లీ సీఎం అర‌వింద్‌ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ అనిల్ బైజ‌ల్‌, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష‌వ‌ర్ధ‌న్ హాజ‌రుకానున్నారు. ఇవాళ సాయంత్రం నార్త్ బ్లాక్‌లో స‌మీక్షా స‌మావేశం జ‌రుగనున్న‌ది. క‌రోనా కేసులు పెరుగ‌కుండా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌నే అంశంపై చ‌ర్చించనున్నారు.  

ఢిల్లీలో గ‌త వారం రోజులుగా ప్ర‌తి రోజూ ఏడు వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. నిన్న ఒకేరోజు కొత్త‌గా 7342 కేసులు నమోద‌వ‌గా, 96 మంది మ‌ర‌ణించారు. ఇప్ప‌టివ‌ర‌కు 4,82,170 కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో 44,456 యాక్టివ్‌ కేసులు ఉండ‌గా, 7519 మంది మ‌ర‌ణించారు. కాలుష్యం, పండుగ‌ల కార‌ణంగా రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి మూడోవిడుత విజృంభించే అవ‌కాశం ఉంద‌ని గ‌త వార‌మే ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.