గురువారం 09 జూలై 2020
National - Jun 28, 2020 , 15:00:27

అత‌ను ఢిల్లీ ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెడుతున్నాడు: అమిత్‌షా

అత‌ను ఢిల్లీ ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెడుతున్నాడు: అమిత్‌షా

న్యూఢిల్లీ: ఢిల్లీలో జూలై 31 నాటికి 5.5 ల‌క్షల క‌రోనా కేసులు న‌మోద‌య్యే అవ‌కాశ‌ముందన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నిష్ సిసోడియా వ్యాఖ్య‌ల‌ను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఖండించారు. జూలై చివ‌రినాటికి ఢిల్లీ ఆస్ప‌త్రుల్లో బెడ్లు కూడా ఖాళీగా ఉండ‌ని పరిస్థితి నెల‌కొంటుందంటూ సిసోడియా ఢిల్లీ ప్ర‌జ‌లను భ‌య‌పెడుతున్నాడ‌ని అమిత్‌షా విమ‌ర్శించారు. అయితే సిసోడియా అంచ‌నా స‌రైన‌దా? కాదా? అని విష‌యంపై తాను స్పందించ‌బోన‌ని, అత‌ని మాట‌లవ‌ల్ల ప్ర‌జ‌ల మ‌న‌సుల‌లో భ‌యం వెంటాడుతుంద‌ని షా మండిప‌డ్డారు. 

నీతి ఆయోగ్‌కు చెందిన పౌల్‌, ఐసీఎమ్మార్‌‌ చీఫ్‌ భార్గ‌వ‌, ఎయిమ్స్ ఢిల్లీ డైరెక్ట‌ర్‌ గులేరియాల‌తో ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితిపై తాను చ‌ర్చించానని, ఢిల్లీలో ఎక్క‌డా క‌మ్యూనిటీ ట్రాన్స్‌మిష‌న్ లేదని అమిత్‌షా చెప్పారు. ఎక్కువ ప‌రీక్ష‌లు చేస్తున్నందున కేసుల సంఖ్య పెరుగుతున్న‌ద‌ని, దీని గురించి అతిగా భ‌య‌పడాల్సిన అవ‌స‌రం లేదని పేర్కొన్నారు. కాగా, జూన్ 9న మ‌నీష్‌ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో కేసుల సంఖ్య‌ జూలై 15 నాటికి 2.5 ల‌క్ష‌లు, జూలై 31 నాటికి 5.5 ల‌క్ష‌లకు చేరుకునే అవ‌కాశం ఉంద‌ని వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో సిసోడియా వ్యాఖ్య‌ల‌ను అమిత్‌షా ఖండించారు. 


logo