రైతు ఇంట్లో అమిత్ షా, బీజేపీ నేతల భోజనం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సందర్శనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక రైతు ఇంట్లో భోజనం చేశారు. పశ్చిమ్ మెడినిపూర్ జిల్లాలోని బెలిజూరి గ్రామానికి చెందిన అన్నదాత ఆతిథ్యాన్ని ఆయన స్వీకరించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా, రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్‌తో కలిసి భోజనం చేశారు. ఓ వైపు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మెజార్టీ రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నారు. మరోవైపు కొందరు రైతుల మద్దతు పొందేందుకు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా వారితో సమావేశాలు జరుపడంతోపాటు విందు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కాగా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమిత్ షా పక్షం రోజుల్లోనే మరోసారి ఆ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. శనివారం తెల్లవారుజామున 1:30 గంటలకు కోల్‌కతా చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే ట్వీట్ చేశారు. ‘కోల్‌కతాకు చేరుకున్నాను. గురుదేవ్ ఠాగూర్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వంటి గొప్ప నాయకుల గడ్డ మీద అడుగుపెట్టిన సందర్భంగా ఈ భూమికి నమస్కరిస్తున్నా’ అని పేర్కొన్నారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా తొలుత కోల్‌కతాలోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రామకృష్ణ ఆశ్రమాన్ని సందర్శించారు. బీజేపీ శనివారం నిర్వహించే భారీ ర్యాలీలో పాల్గొంటారు. మరోవైపు రాష్ట్రంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు, నేతలు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరవచ్చని సమాచారం.
తాజావార్తలు
- గంగానది ప్రశాంతత మంత్రముగ్ధం : ఎమ్మెల్సీ కవిత
- 'విరాటపర్వం' విడుదల తేదీ ఖరారు
- పిల్లల డాక్టరైనా.. విచక్షణ కోల్పోయి..
- కొవిడ్ షాక్ : పసిడి డిమాండ్ భారీ పతనం
- సెంటిమెంట్ ఫాలో అవుతున్న వరుణ్ తేజ్..!
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న కార్తీకదీపం ఫేమ్
- ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆప్ పోటీ
- వేగంగా కొవిడ్ వ్యాక్సినేషన్ జరుపుతున్న దేశంగా భారత్
- చిల్లరిచ్చేలోపు రైలు వెళ్లిపోయింది... తరువాతేమైందంటే?..
- ఆ తీర్పు ఇచ్చింది జస్టిస్ పుష్పా వీరేంద్ర.. ఎవరామె ?