మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 01, 2020 , 08:27:35

ఈనెల 16న తెర‌చుకోనున్న పాఠ‌శాల‌లు, కాలేజీలు

ఈనెల 16న తెర‌చుకోనున్న పాఠ‌శాల‌లు, కాలేజీలు

చెన్నై: ‌రాష్ట్రంలో ఈనెల 16 నుంచి తొమ్మిది ఆపై త‌ర‌గ‌తుల విద్యార్థులు స్కూళ్లు‌, కాలేజీల‌కు వెళ్ల‌వ‌చ్చ‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ పాఠ‌శాల‌లు, కాలేజీలు తెరుచుకోవ‌చ్చ‌ని తెలిపింది. మాస్కులు, శానిటైజ‌ర్లు, భౌతిక దూరం, థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ వంటి నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని స్ప‌ష్టం చేసింది. అదేవిధంగా రాష్ట్రంలో న‌వంబ‌ర్ 10 నుంచి సినిమా టాకీస్‌ల‌ను తెరుచుకోవ‌చ్చ‌ని తెలిపింది. అయితే 50 శాతం సీటింగ్ సామ‌ర్థ్యంతోనే థియేటర్ల‌ను న‌డ‌పాల‌ని తెవెల్ల‌డించింది. దీంతోపాటు జూ, అమ్యూజ్‌మెంట్ పార్కులు, ఎంట‌ర్‌టైన్‌మెంట్ పార్కులు, మ్యూజియంలు తెరుచుకోనున్నాయ‌ని ప్ర‌క‌టించింది. ఈమేర‌కు ప్ర‌భుత్వం క‌రోనా అన్‌లాక్‌ గైడ్‌లైన్స్‌ను విడుద‌ల చేసింది. 

రాష్ట్రంలో ప్ర‌ముఖ కూర‌గాయ‌ల మార్కెట్ అయిన కోయంబేడు మార్కెట్‌లో పండ్ల హోల్‌సేల్ అమ్మ‌కాలు రేప‌టి నుంచి ప్రారంభ‌మ‌వుతాయ‌ని తెలిపింది. విడుత‌ల వారీగా కూర‌గాయ‌లు, పండ్ల అమ్మ‌కాలు న‌వంబ‌ర్ 16 నుంచి ప్రారంభ‌మ‌వ‌నున్నాయ‌ని వెల్ల‌డించింది. ఈ మార్కెట్‌లో గ‌త మే నెల‌లో 3500కుపైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో అధికారులు మార్క‌ట్‌ను మూసివేశారు. కూర‌గాయ‌లు, ఆహార ఉత్ప‌త్తుల అమ్మాకాల‌ను కొన్నిరోజుల క్రిత‌మే ప్రారంభించింది.     ‌