ఆదివారం 05 జూలై 2020
National - Jun 18, 2020 , 18:01:10

చైనాతో ఘర్షణ.. 33 యుద్ధ విమానాలకు ఐఏఎఫ్‌ ప్రతిపాదన

చైనాతో ఘర్షణ.. 33 యుద్ధ విమానాలకు ఐఏఎఫ్‌ ప్రతిపాదన

న్యూఢిల్లీ: లఢక్‌ సరిహద్దులో చైనాతో ఘర్షణ నేపథ్యంలో రష్యా నుంచి 33 యుద్ధ విమానాల కొనుగోలుకు భారత వాయుసేన (ఐఏఎఫ్‌) ప్రతిపాదించింది. వీటిలో 21 మింగ్‌-29, 12 ఎస్‌యు‌-30ఎంకేఐ యుద్ధ విమానాలున్నట్లు ప్రభుత్వ అధికార వర్గాలు గురువారం పేర్కొన్నాయి. వీటిని సమకూర్చుకోవాలని ఐఏఎఫ్‌ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నదని వారు చెప్పారు.

కాగా తాజాగా చైనాతో ఘర్షణ నేపథ్యంలో వచ్చేవారం జరుగనున్న రక్షణశాఖ ఉన్నతస్థాయి సమావేశంలో రూ.6 వేల కోట్ల విలువైన ఈ డీల్‌ గురించి ఐఏఎఫ్ ప్రతిపాదించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన ప్రమాదాల్లో కుప్పకూలిన యుద్ధ విమానాల స్థానాన్ని వీటితో భర్తీ చేయాలని భారత వాయుసేన భావిస్తున్నట్లు వెల్లడించాయి. logo