బుధవారం 03 జూన్ 2020
National - Apr 10, 2020 , 17:39:12

20473 మంది విదేశీయుల తలరిలింపు

20473 మంది విదేశీయుల తలరిలింపు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో ఇప్పటివరకు 20,473 మంది విదేశీయులను వారి స్వదేశాలకు తరలించామని విదేశాంగశాఖ ప్రకటించింది. వివిధ దేశాల  విజ్ఞప్తి మేరకు ఏప్రిల్‌ 9 (గురువారం) నాటికి దేశంలో ఉన్న ఇరవై వేలకు పైగా విదేశీయులను వారి సొంత దేశాలకు పంపించామని, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. అదేవిధంగా పరిస్థితులను బట్టి విదేశాల్లో ఉన్న భారతీయులను ఇక్కడికి తీసుకురావడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని విదేశాంగ శాఖ సమన్వయకర్త దమ్ము రవి తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయులకోసం హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశామని, విదేశీ రాయబారులు, హై కమిషనర్లు వారిని అనునిత్యం సంప్రథిస్తున్నారని, ఎప్పటికప్పుడు వారి పరిస్థితులను తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు.


logo