శనివారం 23 జనవరి 2021
National - Dec 04, 2020 , 16:13:14

ఆకాశ్ క్షిప‌ణుల‌ను విజ‌య‌వంతంగా ప‌రీక్షించిన IAF

ఆకాశ్ క్షిప‌ణుల‌ను విజ‌య‌వంతంగా ప‌రీక్షించిన IAF

న్యూఢిల్లీ: భార‌త్, చైనా మ‌ధ్య స‌రిహ‌ద్దుల్లో వాస్త‌వాధీన రేఖ వెంబ‌డి ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ (IAF) తాజాగా ఆకాశ్ క్షిప‌ణి ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. ఆధునీక‌రించిన 10 ఆకాశ్ క్షిప‌ణుల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని సూర్య‌లంక టెస్ట్ ఫైరింగ్ రేంజ్ నుంచి విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. ఒకవేళ శ‌త్రుసేన‌ల యుద్ధ విమానాలు భార‌త గ‌గ‌న‌త‌లంలోకి ప్ర‌వేశిస్తే కూల్చివేయ‌డానికి ఈ ఆకాశ్ క్షిప‌ణులు తోడ్ప‌డుతాయ‌ని ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. 

దాదాపు 10 ఆకాశ్ క్షిప‌ణ‌లను ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ ప‌రీక్షించింద‌ని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. శ‌త్రు దేశ విమానాలు దాడికి వ‌స్తే వేర్వేరు వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో ఆకాశ్ క్షిప‌ణుల సాయంతో ఆ దాడుల‌ను తిప్పికొట్ట‌డం ఎలా అనే దానిపై ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది ప్రాక్టీస్ చేశార‌ని వెల్ల‌డించింది. స‌రిహ‌ద్దు వివాదం నేప‌థ్యంలో ఇండియ‌న్ ఆర్మీ ఇప్ప‌టికే భారీ స్థాయిలో ఆకాశ్ క్షిప‌ణుల‌ను ఈస్ట‌ర్న్ ల‌ఢ‌ఖ్ ప్రాంతాల్లో మోహ‌రించింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo