మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 12, 2020 , 16:58:14

బచ్చన్లు కోలుకోవాలని నేపాల్‌ ప్రధాని ట్వీట్‌

బచ్చన్లు కోలుకోవాలని నేపాల్‌ ప్రధాని ట్వీట్‌

న్యూ ఢిల్లీ: కొవిడ్‌-19 నుంచి బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, ఆయన తనయుడు అభిషేక్‌ బచ్చన్‌ కోలుకోవాలని నేపాల్‌ ప్రధానం కేపీశర్మ ఒలి ఆదివారం ట్వీట్‌ చేశారు. ‘ఇండియా దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, ఆయన తనయుడు జూనియర్‌ బచ్చన్‌ ఆరోగ్యంగా ఉండాలి. కొవిడ్‌ నుంచి త్వరగా కోలువాలని కోరుకుంటున్నా.’ అని ఒలి పేర్కొన్నాడు. 

కొవిడ్ -19 పరీక్షలు చేయించుకున్నామని, తనకు తన కుమారుడికి పాజిటివ్‌ వచ్చిందని అమితాబ్‌ బచ్చన్‌ శనివారం ప్రకటించారు. ముంబై దవాఖానలో చేరామని తెలిపారు. అలాగే, అభిషేక్‌ బచ్చన్‌ భార్య, ప్రముఖ బాలీవుడ్‌ నటి ఐశ్వర్యరాయ్‌, వారి కూతురు ఆరాధ్యకు కూడా  ఆదివారం కరోనా పాజిటివ్‌ వచ్చింది. కాగా, భారత్‌తో నేపాల్ సరిహద్దు ఉద్రిక్తతల మధ్య బచ్చన్‌లు కోలుకోవాలని నేపాలి ప్రధాని కేపీ శర్మ ఒలి ట్వీట్‌ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo