ఆదివారం 05 జూలై 2020
National - Jun 20, 2020 , 01:20:21

భారత సైనికుల వీరత్వం మరువలేనిది

భారత సైనికుల వీరత్వం మరువలేనిది

న్యూఢిల్లీ, జూన్‌ 19: గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో పోరాడుతూ అమరులైన భారత సైనికులకు అమెరికా, ఫ్రాన్స్‌లు ఘనంగా నివాళులు అర్పించాయి.  ‘అమర జవాన్ల కుటుంబాలకు అమెరికా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నది. వారి ధైర్య సాహసాలు మరువలేనివి’ అని భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్‌ జస్టర్‌ శుక్రవారం ట్వీట్‌ చేశారు. అమరుల కుటుంబాలకు, భారత ప్రజలకు తీవ్ర సంతాపం తెలుపుతున్నట్టు ఫ్రాన్స్‌ రాయబారి ఎమ్మాన్యుయేల్‌ లెనైన్‌ కూడా ట్వీట్‌ చేశారు.logo