బుధవారం 03 జూన్ 2020
National - May 15, 2020 , 17:16:14

రైతుకు మంచి ధర దక్కేలా చట్టంలో మార్పులు

రైతుకు మంచి ధర దక్కేలా చట్టంలో మార్పులు

ఢిల్లీ : పండించిన పంటలకు రైతులకు మంచి ధర దక్కేలా నిత్యావసర వస్తువుల చట్టంలో అవసరమైన సవరణలు తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ-3 వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు ప్రకటించారు. మీడియా ద్వారా ఆమె వివరాలను వెల్లడిస్తూ... ఈసీ యాక్ట్‌ 1955లో సవరణలు చేయనున్నట్లు చెప్పారు. రైతులకు మెరుగైన ధరలు దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. తృణధాన్యాలు, తినదగిన నూనెలు, నూనెగింజలు, పప్పుధాన్యాలు, ఉల్లిపాయాలు, బంగాళాదుంపలతో సహా వ్యవసాయ ఆహార పదార్థాలు ఈ చట్టం కింద నియంత్రించబడతాయన్నారు. తీవ్ర విపత్కర పరిస్థితుల్లో మాత్రమే ఆహార పదార్థాల నిల్వపై నిషేధం ఉంటుందన్నారు. 


logo