మంగళవారం 11 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 10:21:52

గ‌ర్భిణిని బుట్ట‌లో కూర్చోబెట్టి.. న‌దిని దాటారు.. వీడియో

గ‌ర్భిణిని బుట్ట‌లో కూర్చోబెట్టి.. న‌దిని దాటారు.. వీడియో

రాయ్‌పూర్ : ఓ నిండు గ‌ర్భిణికి నెల‌లు నిండాయి. పురిటి నొప్పుల‌తో బాధ‌ప‌డుతోంది. కానీ ఆ గ్రామానికి అంబులెన్స్ వ‌చ్చే మార్గం లేదు. రోడ్డు సౌక‌ర్యం లేదు. దీంతో ఆ గ‌ర్భిణిని ఓ బుట్ట‌లో కూర్చోబెట్టి న‌దిని దాటారు. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని సూర్గుజా జిల్లాలోని కద్నాయి గ్రామంలో నిన్న చోటు చేసుకుంది. 

గ‌ర్భిణిని బుట్ట‌లో కూర్చోబెట్టిన న‌లుగురు వ్య‌క్తులు.. క‌ట్టెల స‌హాయంతో మోసుకెళ్లారు. ఆ స‌మ‌యంలో న‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్న‌ప్ప‌టికీ.. ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకుని న‌దిని దాటారు. అనంత‌రం గ‌ర్భిణిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఈ ఘ‌ట‌న‌పై సూర్గుజా జిల్లా క‌లెక్ట‌ర్ సంజ‌య్ కుమార్ ఝా స్పందించారు. మారుమూల గ్రామాల ప్ర‌జ‌లు వ‌ర్షాకాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు ఆలోచిస్తున్నాం. చిన్న కార్లు వారికి అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. 


logo