సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 22:39:32

అడిగినంత డబ్బు ఇవ్వలేదని కొవిడ్‌ రోగులను దించేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌!

అడిగినంత డబ్బు ఇవ్వలేదని కొవిడ్‌ రోగులను దించేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌!

కోల్‌కతా: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను తట్టుకొని నిలబడుతూ కొందరు ఇతరులకు సహాయపడుతున్న వార్తలు చూస్తున్నాం. అయితే, దురదృష్టవశాత్తు ఈ సమయాన్ని ఆసరాగా చేసుకొని సొమ్ము చేసుకోవాలనుకునే వారు కూడా ఉన్నారు. తాను అడిగినంత డబ్బు ఇవ్వలేదని కొవిడ్‌ బారినపడ్డ ఇద్దరు చిన్నారులు, వారి తల్లిదండ్రులను అంబులెన్స్‌ నుంచి దించేశాడు ఓ ప్రబుద్ధుడు.

కోల్‌కతాకు చెందిన తొమ్మిదిన్నరేళ్ల బాలుడితోపాటు అతడి తొమ్మిది నెలల తమ్ముడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారిద్దరూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చైల్డ్‌ హెల్త్‌(ఐసీహెచ్‌)లో చికిత్సపొందుతున్నారు. అయితే, వారిని వేరే దవాఖానకు తీసుకెళ్లేందుకు వారి తండ్రి అంబులెన్స్‌ బుక్‌ చేశాడు. ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోల్‌కతా మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌కు అంబులెన్స్‌ డ్రైవర్‌ రూ. 9,200లు అడిగాడని తండ్రి ఆవేదన వ్యక్తంచేశాడు. అంత మొత్తం ఇచ్చుకోలేను అని అన్నందకు తమను అంబులెన్స్‌ నుంచి దింపేశాడని వాపోయాడు. చివరగా ఐసీహెచ్‌ వైద్యుడు వచ్చి చెప్తే రూ. రెండు వేలకు తీసుకెళ్లాడని తెలిపాడు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo