సోమవారం 08 మార్చి 2021
National - Jan 27, 2021 , 16:12:21

ట్రక్కును ఢీకొట్టిన అంబులెన్స్‌.. ఐదుగురు దుర్మరణం

ట్రక్కును ఢీకొట్టిన అంబులెన్స్‌.. ఐదుగురు దుర్మరణం

బదోహి : ఉత్తరప్రదేశ్‌లోని బదోహి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్‌ అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టడంతో డ్రైవర్‌తో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమబెంగాళ్‌లోని అసంసోల్‌ ప్రాంతంలో వినిత్‌ సింగ్‌ అనే వ్యక్తి మృతిచెందాడు. రాజస్థాన్‌లోని చిత్తోర్‌ఘర్‌ జిల్లాకు అంబులెన్స్‌లో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తరలిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని బదోహి జిల్లా గోపీగంజ్‌ ప్రాంతంలో పొగమంచు కారణంగా రహదారి సరిగా కనిపించకపోవడంతో డ్రైవర్‌ ముందు వెళ్తున్న పుస్తకాల లోడు ట్రక్కును వేగంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జయి డ్రైవర్‌తో సహా అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న నలుగురు ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ రాంబదన్‌ సింగ్‌ తెలిపారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo