బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 15:50:45

అంబేడ్క‌ర్ విగ్ర‌హాన్ని అప‌విత్రం చేశారు

అంబేడ్క‌ర్ విగ్ర‌హాన్ని అప‌విత్రం చేశారు

అహ్మ‌దాబాద్ : భావ్ న‌గ‌ర్ జిల్లాలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు.. అంబేడ్క‌ర్ విగ్ర‌హాన్ని అప‌విత్రం చేశారు. ఆదివారం రాత్రి అంబేడ్క‌ర్ విగ్ర‌హాన్ని బ‌కెట్ తో క‌ప్పి ఉంచారు. విగ్ర‌హ స్టేజ్ వ‌ద్ద మ‌ద్యం సేవించి.. ఆ బాటిళ్ల‌ను అక్క‌డే ప‌డేశారు. సోమ‌వారం ఉద‌యం మ‌ద్యం బాటిళ్ల‌ను చూసి ద‌ళిత సంఘాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాయి. పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. అప‌విత్రమైన అంబేడ్క‌ర్ విగ్ర‌హాన్ని ద‌ళిత నాయ‌కులు శుద్ధి చేశారు. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డ దుండ‌గుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ద‌ళితులు డిమాండ్ చేశారు.


logo