సోమవారం 06 జూలై 2020
National - Jun 20, 2020 , 12:50:00

మద్యం హోం డెలివరీ..అమెజాన్‌కు అనుమతి

మద్యం హోం డెలివరీ..అమెజాన్‌కు అనుమతి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మద్యం ప్రియులకు శుభవార్త.  కరోనా సంక్షోభం, అన్‌లాక్‌-1 నిబంధనలు అమలవుతున్న నేపథ్యంలో మద్యం హోం డెలివరీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.  లిక్కర్‌ షాపులు తిరిగి ప్రారంభించిన  నేపథ్యంలో సామాజిక దూరం పాటించడం, కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా ఆల్కహాల్‌ను ఇంటి వద్దకే సరఫరా చేసే వెసలుబాటు కల్పించింది.

దేశంలోనే మొట్టమొదటిసారిగా  బెంగాల్ రాష్ట్రంలో మద్యం డెలివరీకి అమెరికా ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్.డాట్‌కామ్‌‌కు  ఆ రాష్ట్ర  బేవరేజెస్ కార్పొరేషన్‌ అనుమతినిచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఆన్‌లైన్‌ డెలివరీ చేయడానికి అమెజాన్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.  దీనికి సంబంధించిన  రిజిస్ట్రేషన్ కూడా పూర్తైనట్లు తెలిసింది.  భారత గ్రోసరీ వెంచర్‌ బిగ్‌బాస్కెట్‌కు కూడా రాష్ట్రంలో మద్యం డోర్‌డెలివరీకి ఆమోదం లభించినట్లు అధికారులు వెల్లడించారు.  ఈ రెండు సంస్థలు కూడా బెంగాల్‌ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఈ విషయంపై స్పందించడానికి రెండు సంస్థలు నిరాకరించాయి. 


logo