మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 23:54:38

రేపటి నుంచి "అమెజాన్ ప్రైమ్ డే సేల్"

రేపటి నుంచి

ముంబై : అన్‌లైన్ షాపింగ్ ప్రియులకు మరో డిస్కౌంట్ల పండగ వచ్చేసింది. అమెజాన్ తన యూజర్లకోసం ఈ 6,7 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ పేరిట భారీ డిస్కౌంట్‌పై అమ్మకాలను నిర్వహించనున్నది. ఇప్పటికే కౌన్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. ఈ ప్రైమ్ డే సేల్ ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఫర్నీచర్, హోమ్ అప్లయెన్సెస్‌తో పాటు స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. కరోనా వైరస్ అవుట్‌బ్రేక్‌ తర్వాత తొలిసారి అమెజాన్ 'ప్రైమ్ డే'ను నిర్వహించడం ఈ సేల్స్ ప్రత్యేకత. అంతకుముందు లాగా కాకుండా వర్చ్యువల్‌గా అమెజాన్ ఆపరేషన్స్‌ను చేపట్టనున్నది. ఈ సేల్స్‌లో దాదాపు అన్ని టాప్‌ బ్రాండ్ మొబైల్స్‌పై దాదాపు 40శాతం ఆఫ్‌ ఉంది. ఎలక్ట్రానిక్‌ అండ్‌ యాక్ససరీస్‌పై 60 శాతం వరకు డిస్కౌంట్‌ ప్రకటించారు. కెమోరాలు అండ్‌ యాక్సిసరీస్‌, హెడ్‌ ఫోన్స్‌పై 70 శాతం వరకు డిస్కౌంట్‌ ఇవ్వనున్నారు. ల్యాప్‌టాప్స్‌, ఫిటన్‌నెస్‌ ట్రాకర్స్‌పై డిస్కౌంట్ ఉన్నది. 


logo