బుధవారం 27 జనవరి 2021
National - Jan 13, 2021 , 21:24:48

గుర్రంపై వచ్చి.. పార్సిల్‌ డెలివరీ

గుర్రంపై వచ్చి.. పార్సిల్‌ డెలివరీ

శ్రీనగర్‌: శీతాకాలం కారణంగా జమ్ముకశ్మీర్‌లో భారీగా ముంచు కురుస్తున్నది. ఇండ్లతోపాటు రోడ్లు కూడా మంచుతో కప్పబడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాహనాల్లో ప్రయాణించడం చాలా కష్టం. అయితే శ్రీనగర్‌లోని అమేజాన్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను ఈ ప్రతికూల వాతావరణం నిలువరించలేకపోయింది. ఆ వ్యక్తి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. ఎంచక్కా గుర్రంపై వెళ్లి పార్సిల్‌ను అందజేశాడు. ఫొటో జర్నలిస్ట్‌ ఉమర్ గనీ ఈ వీడియోను తన సామాజిక ఖాతాలో పోస్ట్‌ చేయగా వైరల్‌ అయ్యింది. అమేజాన్‌ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ తెలివిని పలువురు నెటిజన్లు ప్రశంసించారు.

అమేజాన్‌ హెల్ప్‌డెస్క్‌ కూడా దీనిపై వినూత్నంగా స్పందించింది. ప్రోడక్ట్‌ సేఫ్టీ బాగున్నది. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ అందుబాటులో ఉన్నారు. అయితే బాగా మంచు కురుస్తున్నది. అయినప్పటికీ హామీ ఇచ్చిన సమయానికి పార్సిల్‌ డెలివరీ జరిగింది. ఎలా సాధ్యం? అని ప్రశ్నిస్తూ పక్కన గుర్రం బొమ్మను ఉంచింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo